ఒక నాస్తికునికి ఆర్ధిక సంబంధమైన అవసరం వచ్చినట్లైతే, సహాయం కొరకు ఇతర మనుష్యుల దగ్గరకు పరిగెత్తుతాడు. ఎందుకంటే ‘దేవుని యొక్క ఉనికిని’ అతడు నమ్మడు. మరి మన సంగతేంటి? మనము డబ్బు అవసరం లో ఉన్నప్పుడు మనమేమి చేస్తున్నాము? మనకు ఆర్ధిక సంక్షోభమునిచ్చి దేవుడు మనలను పరీక్షిస్తాడు.
అపొస్తలులు కూడా తరచుగా ఆర్ధిక అవసరాలలో ఉన్నారు (1 కొరింథీ 4:11). “కానీ “ వాళ్ళు ఎప్పుడు అడుక్కోలేదు , అప్పుచేయలేదు. దీనికి బదులు వారి అవసరాల గురించి దేవుని మీద ఆధారపడ్డారు మరియు దేవుడు వారి అవసరాలు తీర్చాడు.
ఆశ్చర్యకరుడైన దేవుడు నమ్మకమైన తన పిల్లలను ఎన్నడూ విడిచిపెట్టడు. అవసరమైతే , తన దాసుడైన ఏలీయా ను పోషించినట్లుగా తన పిల్లలను ఆయన పోషిస్తాడు.
ఇశ్రాయేలీయులు ‘సహాయం కొరకు’ ఐగుప్తు వైపునకు తిరిగినప్పుడు వారికి శ్రమ తప్ప ఏమి మిగులలేదు. దేవుడు వారిని ఆయన వైపునకు తిరగమని కోరుకున్నాడు. ఆర్థికసంబంధమైన అవసరములలో మనము ఆయనను నమ్మి, ప్రార్ధించి అయన యొద్దకే పరుగెత్తుచున్నామా? లేక ఒక నాస్తికునివలే మనము ప్రవర్తిస్తున్నామా ? (యెషయా 30:7.21 కీర్తన 121 చదవండి).
బుద్ధిహీనంగా ఇతర విశ్వాసులతో పోల్చుకోకుండా , దేవుడు సంతోషంగా ఇచ్చిన దానితో ‘సంతృప్తి చెందే మనస్సును' మనము కలిగియున్నట్లైతే **“నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను”** (హెబ్రీ 13:5) అనే వాగ్దానము మన జీవితంలో నిజం అవుతుంది.
ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయనకు విధేయత చూపిస్తారో వారికే దేవుడు సహాయం చేస్తాడు (యిర్మీయా 29:11.13). **దేవుణ్ణి ఘనపరచు వారిని ఆయన తప్పక ఘనపరుస్తాడు.** (ఆయన మాటలకు మరియు న్యాయవిధులకు విధేయత చూపించడం).
**ప్రార్ధన**
**మా పరలోకపు తండ్రీ,** అవసరమైన పరిస్థితులలో “మనుష్యులవైపు “ కాకుండా మీ యొద్దకు పరిగెత్తే నమ్మకమైన హృదయమును మాకు దయచేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రీ , **ఆమేన్.**
**రచయిత**
జాక్ పూనెన్
Comments
Post a Comment